![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -849 లో.. రిషికి వసుధార అలా ఎందుకు మెసేజ్ చేసిందోనని అడుగుదామని వస్తాడు రిషి. అలా వచ్చిన రిషి మొహం పై తలుపు వేసి వెళ్లిపోయేలా చేస్తుంది వసుధార. ఆ తర్వాత రిషి బాధపడుతాడని తెలిసి రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. 'మీ పెళ్లి ఎప్పుడు సర్' అని ఎందుకు మెసేజ్ చేసావని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార మాత్రం.. రిషి ప్రేమ ఉన్నట్లు మాట్లాడినట్లు, నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదని రిషి అన్నట్లు ఉహించుకుంటుంది. కాసేపటికి సమాధానం చెప్పు వసుధారా అని రిషి గట్టిగా అడుగుతాడు. మీ గతంలో నేను మీ మనసులో లేను. అలాంటప్పుడు నాకేం అవసరం లేదని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత నీకు అవసరం లేదంటే ఆ మెసేజ్ ఎందుకు చేసావని అడుగుతాడు. ఆ మెసేజ్ గురించి తప్ప వసుధార అన్ని మాట్లాడుతుంది. దాంతో రిషికి కోపం వచ్చి వెళ్లిపోతున్నా అని వెళ్తాడు. వసుధార వెళ్ళిబోతుంటే ఏంజిల్ వాయిస్ మెసేజ్ చేస్తుంది. నాకు రిషిని పెళ్లి చేసుకోవాలని ఉందని, రిషితో చెప్పవా అని ఏంజిల్ చేసిన వాయిస్ మెసేజ్ వసుధార వింటుంది. ఆ మాటలను రిషి వెనకాల నుంచి వచ్చి వింటాడు. కోపంగా ఏంజిల్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడమేంటి? ఇందుకేనా ఇలా ప్రవర్తిస్తూన్నావని వసుధారతో రిషి అంటాడు. ఇది కూడా నా దగ్గర దాచావంటూ రిషి కోపంగా వెళ్ళిపోతాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు కాలేజీకి సంబంధించిన వర్క్ చేస్తుంటారు. దూరంగా ఉండి శైలేంద్ర చూస్తాడు. నాకు తెలియనివ్వకుండా కాలేజీ పనులు చేస్తున్నారా? కాలేజీని మొత్తం నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని శైలేంద్ర అనుకుంటాడు. మరొక వైపు ఏంటి రిషి ఫోన్ లిఫ్ట్ చేయడు, వసుధార లిఫ్ట్ చెయ్యట్లేదని ఏంజిల్ ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వసుధార.. ఏంజిల్ కి ఫోన్ చేస్తుంది. రిషిని కలిసావా నా మనసులో ఉన్నా దాని గురించి చెప్పవా అని ఏంజిల్ అడుగుతుంది. చెప్పానని వసుధార అంటుంది. అవునా ఏం అన్నాడు? నాపై తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటూ అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. వసుధార సైలెంట్ గా ఉంటుంది. సరేలే ఇప్పుడు రిషి వస్తాడు కదా నేనే తెలుసుకుంటానని ఏంజిల్ అంటుంది.
ఆ తర్వాత రిషి ఇంటికి రావడంతోనే ఏంజిల్ ఎక్కడికి వెళ్ళవని రిషిని అడుగుతుంది. ఏంజిల్ పై రిషి కోప్పడట్టు ఉహించుకుంటాడు. బయటకు వెళ్ళను.. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. మనం ఏది ఉహించుకున్నా? అది నిజం కాదంటూ ఇండైరెక్ట్ గా ఏంజిల్ అంటే ఇష్టం లేనట్లుగా రిషి మాట్లాడుతాడు. అయిన ఏంజిల్ కి అర్థం కాదు. రిషి గదిలో ఒక లవ్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏంజిల్ రాయమంటే వసుధార రాస్తుంది. అది చూసి వసుధారకి ఫోన్ చేస్తాడు రిషి. ఏంజిల్ రాయమంటే రాసానంతే మీరు మీరు తేల్చూకోండి. ఏ విషయమైన మీ ఫ్రెండ్ కి అర్థం అయ్యేలా మీరు చెప్పండని రిషికి వసుధార చెప్తుంది. నా నిర్ణయం ఎలా చెప్పాలనే దానికి టైం కావాలని రిషి అంటాడు. మరొక వైపు శైలేంద్ర వచ్చి.. రాత్రి మీరు కాలేజీకి సంబంధించిన వర్క్ చేశారేంటని అడుగుతాడు. అవునా ఏం చేశారని ఫణింద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |